Education | సుల్తానాబాద్ రూరల్, జూలై 1 : విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మంచరామి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం డీఈవో సందర్శించారు. పాఠశాల మరమ్మతు పనులను, కలర్స్ వేయడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులు చేసిన వారిని అభినందించారు.
మరోవైపు పిల్లల సంఖ్య పెరగడంతో డీఈఓ ఆనందం వ్యక్తం చేశారు. ఎంఈఓ ఆరెపల్లి రాజయ్యతో కలిసి డీఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే సుల్తానాబాద్ బుక్ స్టాల్ శ్రీనివాస్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ , పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గట్టయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!