Koya Sree harsha | పెద్దపల్లి, అక్టోబర్ 14 : నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ది పనులు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. రామగిరి, జూలపల్లి, ధర్మారం మండలాలలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణ పెండింగ్ పనులు వేగవంతం చేసి డిసెంబర్ చివరి వరకు తహసీల్దార్ కార్యాలయ భవనాలు అందుబాటులోకి రావాలని సూచించారు.
పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో మంజూరైన వివిధ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ గిరీష్బాబు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య