Ganesh Immersion | పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 3 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో శుక్రవారం నిర్వహించే నిమజ్జన వేడుకలు విజయవంతం అయ్యేలా పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆర్డీఓ గంగయ్య, ఏసీపీ గజ్జి కృష్ణలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు.
పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప గుడి, అమర్ నగర్, మజీద్, జెండా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆయా కూడళ్లలో శోభయాత్రలకు అడ్డుగా ఉన్న విద్యుత్, ఫైబర్, డిష్ వైర్లు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజు పట్టణంలోని దుకాణాల ముందు ఎలాంటి సామాన్లు, వాహనాలను ఉంచకూడని వ్యాపారులకు సూచించారు.
నిర్వాహకులందరూ ఒకే రోజు విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. అర్థరాత్రి వరకు నిమజ్జనం చేసుకోవచ్చని, ఇందుకోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, డీ ఈ తిరుపతి, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్ ఉన్నారు.
RTC Buses | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
MLA Malla Reddy | తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ముఖ్యం : ఎమ్మెల్యే మల్లారెడ్డి
Naxalites | 20 మంది మావోయిస్టులు లొంగుబాటు