RTC Buses | హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే గణేశ్ నిమజ్జనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులను ఆయా ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్, ట్యాంక్‌బండ్‌కు తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
చార్మినార్ డివిజినల్ పరిధిలోని బర్కత్‌పురా, ముషీరాబాద్, ఫలక్‌నూమా, కాచిగూడ, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ డిపోలు, హయత్‌నగర్ పరిధిలోని దిల్సుఖ్నగర్, హయత్‌నగర్-1,2, మిథాని డిపోల నుంచి నిమజ్జనం కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
కాచిగూడ, రాంనగర్ నుంచి బషీర్‌బాగ్ వరకు, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్ నుంచి లక్డీకాపూల్, పటాన్చెరు నుంచి లింగంపల్లి, ఆఫ్జల్‌గంజ్ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు కొనసాగించనున్నాయి.