తాడిచెర్ల ఓపెన్‌కాస్టు గని దిగ్బంధం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌కాస్టు బొగ్గు గనిని శనివారం భూనిర్వాసితులు చుట్టుముట్టారు.
- బొగ్గు ఉత్పత్తిని అడ్డుకున్న నిర్వాసితులు
- డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోవాలని డిమాండ్
మల్హర్, ఫిబ్రవరి 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్‌కాస్టు బొగ్గు గనిని శనివారం భూనిర్వాసితులు చుట్టుముట్టారు. ఇచ్చిన మాట ప్రకారం డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిచెర్ల, కాపురం నిర్వాసితులు బొగ్గు ఉత్పత్తి పనులను అడ్డుకున్నారు. ఓపెన్‌కాస్టు గనిలో బ్లాస్టింగ్ మూలంగా ఇండ్లు దెబ్బతిని, వాయు కాలుష్యంతో జీవచ్ఛవంలా జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
వారం రోజుల క్రితం బొగ్గు ఉత్పత్తి పనులను అడ్డుకోగా ఈ నెల 20లోగా న్యాయం చేస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించామని గుర్తుచేశారు. ప్రతిసారి మాటలతో పంపించడం కాదని, డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకునే ఉద్దేశం ఉందా లేదా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడు గంటల పాటు ఎండలో నిల్చొని నిరసన తెలుపడంతో తాడిచెర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నంచేసినా వినలేదు. స్థానిక సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ రాజు ఓపెన్‌కాస్టు గని వద్దకు చేరుకొని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. సోమవారం వరకు మంత్రి సమయం ఇచ్చారని వారు తెలుపడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

