Naxalites | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా (Sukma) జిల్లాలో బుధవారం దాదాపు 20 మంది మావోయిస్టులు (Naxalites) పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన (Naxalites Surrender) వారిలో 11 మందిపై రూ.33 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. వీరంతా గతంలో అనేక విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఒక్కొక్కరికి ప్రభుత్వ సాయం కింద రూ.50 వేలు అందించారు. అంతేకాదు వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు.
Also Read..
Digital Fraud | పహల్గాం దాడి పేరుతో వృద్ధురాలిని బెదిరించి.. రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
RCB | సంతోషకరమైన క్షణం.. విషాదంగా మారింది.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ భావోద్వేగం
Dowry Harassment | మరో యువతితో భర్త వివాహేతర సంబంధం.. వరకట్న వేధింపులకు మహిళ బలి