Virat Kohli | సంతోషకరమైన క్షణం.. విషాదంగా మారింది.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ భావోద్వేగం
Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద జరిగిన తొక్కిసలాట (stampede) ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా స్పందించారు.
Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద జరిగిన తొక్కిసలాట (stampede) ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా స్పందించారు. ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన రోజు విషాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 4న జరిగిన ఈ దుర్ఘటన జీవితంలో మర్చిపోలేనిదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆర్సీబీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
‘జూన్ 4న జరిగిన హృదయ విదారక ఘటన ఎవరూ ఊహించనిది. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణంగా ఉండాల్సిన రోజు విషాదంగా మారింది. తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడిన అభిమానుల కోసం ప్రార్థిస్తున్నా. ఈ నష్టం ఇప్పుడు మనలో ఒక భాగం. మేమంతా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ముందుకు సాగుతాం’ అని కోహ్లీ తన ప్రకటనలో రాసుకొచ్చారు.
“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని (IPL 2025) గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం జూన్ 4న నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (stampede) జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్ట పరిహారం ప్రకటించింది.
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన దురదృష్టకర ఘటన ఆర్సీబీ కుటుంబానికి తీవ్ర బాధను కలిగించినట్లు పేర్కొంది. బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
కాగా, ఇప్పటికే ఆర్సీబీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేసి గాయపడిన వారికి సాయం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు నష్ట పరిహారం రూ.25 లక్షలుగా ప్రకటించడం గమనార్హం.
Also Read..
Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్లో మరోసారి ముసలం.. సిద్ధరామయ్య, డీకే వర్గీయుల మాటల యుద్ధం
Yuki Bhambri: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్వార్టర్స్లోకి యుకి భాంబ్రి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

