S-400 missile systems | ట్రంప్ టారిఫ్స్ వేళ రష్యాతో భారత్ మరో భారీ డీల్..? మరిన్ని ఎస్-400 కోసం చర్చలు
S-400 missile systems | అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
S-400 missile systems | అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ (S-400 missile systems) అదనపు యూనిట్స్‌ని రష్యా (Russia) నుంచి మరిన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయమై మాస్కోతో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు రష్యా అధికారులను ఊటంకిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది. భారత్ (India) అదనపు ఎస్-400 వ్యవస్థల కొనుగోళ్లకు రష్యా (Russia)తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.
భారత్ ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్థాన్‌తో ఘర్షణల సమయంలో ఈ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. పాకిస్థాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతంగా కూల్చివేసింది. సరిహద్దుల్లో మోహరించిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఖచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసిన నేపథ్యంలో.. భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.
చైనా నుంచి పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం 2018లో కుదిరింది. ఈ ఒప్పందం కింద మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ కోసం రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది.
ఎస్-400 రక్షణ వ్యవస్థ అంటే ఏంటి?
ఎస్-400 ట్రయాంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా మోహరించవచ్చు. ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చివేయగల సామర్థ్యం వీటికి ఉంది. విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తక్షణమే వీటిని 1993లో అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మిస్సైల్ స్టోరేజ్ కంటైనర్లు, లాంచర్లు, రాడార్లు ఇలా వివిధ రకాల ఆయుధాలతో దీన్ని తయారు చేశారు. 2007వ సంవత్సరంలో ఇది వినియోగంలోకి వచ్చింది. రష్యాకు చెందిన ఈ ఎస్-400 మిస్సైళ్లు.. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల రక్షణ వ్యవస్థలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఆయుధాలుగా పేర్కొంటారు.
ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ.. 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటి రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే రెడీ చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 2020-2024 మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతుల్లో 36 శాతం వాటా రష్యాదే. బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, టీ-90 ట్యాంకులు, ఏకే-203 రైఫిళ్ల తయారీ వంటి ఎన్నో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మరో భారీ డీల్‌కు ఇరు దేశాలు సిద్ధమవడం విశేషం.
Also Read..
Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి ముసలం.. సిద్ధరామయ్య, డీకే వర్గీయుల మాటల యుద్ధం
HQ-9C Missiles: చైనాలో విక్టరీ డే పరేడ్.. హెచ్‌క్యూ-9సీ మిసైళ్ల ప్రదర్శన..వీడియో
China: ఆధునిక ఆయుధాలు ప్రదర్శించిన చైనా.. విక్టరీ పరేడ్‌కు హాజరైన పుతిన్, కిమ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

