బీజింగ్: చైనాలో విక్టరీ డే పరేడ్ ఘనంగా జరిగింది. వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించారు. బీజింగ్‌లోని తియాన్మిన్స్క్వైర్లో అట్టహాసం పరేడ్ నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించిన నేపథ్యంలో జరుగుతున్న 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శన చేపట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కూడా వేడుకలను తిలకించారు. ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన హెచ్‌క్యూ-9సీ మిస్సైళ్ల(HQ-9C Missiles)ను చైనా ప్రదర్శించింది. ఈ వర్షన్‌కు చెందిన క్షిపణి వ్యవస్థను పాకిస్థాన్ ఇటీవల కొనుగోలు చేసింది. తమ డిఫెన్స్ నెట్వర్క్ కోసం పాకిస్థాన్ వీటిని వాడుతోంది. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ఈ ఆయుధాలను వాడినట్లు తెలుస్తోంది. కానీ భారతీయ క్షిపణులను ఆ వ్యవస్థ అడ్డుకోలేకపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
#WATCH | HQ-9C missiles seen in China’s Victory Day Parade, in Beijing.
A version of the HQ-9 missile system has been acquired by Pakistan for its defence network. It purportedly saw action as per Pak media in Operation Sindoor, however, failed to protect Pakistani airspace… pic.twitter.com/18LiAGinCb
— ANI (@ANI) September 3, 2025
విక్టరీ డే పరేడ్‌లో ఎయిర్ డిఫెన్స్, యాంటీ మిస్సైల్ ఆపరేషన్స్‌కు చెందిన ఆయుధాలను ప్రదర్శించారు. స్వదేశీ మొబైల్ రేడార్ పరిజ్ఞానంతో తయారైన ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ ఫార్మేషన్ ఆయుధాలను ప్రదర్శించారు. స్టీల్త్ విమానాలను, బాలిస్టిక్ మిస్సైళ్లను పసికట్టే ఆయుధాలు కూడా చైనా వద్ద ఉన్నాయి. హెచ్‌క్యూ-20, హెచ్‌క్యూ-19, హెచ్‌క్యూ-29 వర్షన్‌కు చెందిన మిస్సైళ్ల వ్యవస్థలను పరేడ్‌లో ప్రదర్శించారు. అన్ని రకాల వైమానిక దాడుల్ని ఈ మిస్సైళ్లు తిప్పికొట్టగలవు.