బీజింగ్ : విక్టరీ డే పరేడ్ చైనా(China)లోని బీజింగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలో చైనా తన అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. జెట్ ఫైటర్లు, మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఆయుధాలను చైనా ఆ షోలో చూపించింది. 80వ మిలిటరీ వార్సికోత్సవం సందర్భంగా విక్టరీ డే పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 26 దేశాల నేతలను చైనా ఆహ్వానించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌తో పాటు అనేక మంది దేశాధినేతలు పరేడ్‌కు హాజరయ్యారు. ఇరాన్, మలేషియా, మయన్మార్, మంగోలియా, ఇండోనేషియా, జింబాబ్వే నేతలు పాల్గొన్నారు.
Watch: President #XiJinping greets veterans on Tian’anmen Rostrum #VDay pic.twitter.com/a2qVJZqlaQ
— CGTN (@CGTNOfficial) September 3, 2025
అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సందేశం ఇచ్చారు. శాంతి, యుద్ధం లేదా చర్చలు లేదా ఘర్షణలు.. వీటి మధ్య ఏదో ఒకటి మానవాళి ఎంపిక చేసుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. చరిత్రలో సరైన దిశ వైపునే చైనా ప్రజలు నిలిచి ఉంటారన్నారు. మానవ ప్రగతికి దోహం చేస్తారన్నారు. శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. మానవాళి మనుగడ కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.