న్యూయార్క్: భారత టెన్నిస్ ప్లేయర్ యుకి భాంబ్రి(Yuki Bhambri) తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్ మ్యాచ్‌లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్ డబుల్స్ మ్యాచ్‌లో యుకి భాంబ్రి, తన భాగస్వామి మైఖేల్ వీనస్‌తో కలిసి మూడవ రౌండ్ మ్యాచ్‌లో గెలుపొందారు. జర్మనీ జోడి, నాలుగవ సీడ్ జంట కెవిన్ క్రావిట్జ్, టిమ్ పుట్జ్పై 6-4, 6-4 స్కోరుతో యుకి భాంబ్రి జోడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను గంటా 23 నిమిషాల్లో ముగించారు. క్వార్టర్స్‌లో ఇండియన్ ప్లేయర్ జోడి .. క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్, అమెరికన్ ప్లేయర్ రాజీవ్ రామ్‌తో తలపడనున్నారు. 33 ఏళ్ల యుకీ భాంబ్రి గతంలో గ్రాండ్స్లాట్ టోర్నీల్లో ఎప్పుడూ ఫస్ట్ రౌండ్ దాటి వెళ్లలేదు. ఈ యేడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో అతను మూడవ రౌండ్ వరకు వెళ్లాడు.
MAIDEN GRAND SLAM QF APPEARANCE FOR YUKI BHAMBRI ✨
Yuki & Michael Venus STUN 4th-seed & last year’s Runner-up duo Krawietz/Puetz 6-4, 6-4 to storm into QF of Men’s Doubles at US Open. #USOpen2025 #USOpen pic.twitter.com/RjKZSL9GRz
— India_AllSports (@India_AllSports) September 3, 2025