Oil Palm | పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఫామ్ ఆయిల్ పంటపై రైతులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రవీణ్ కుమార్, రామగుండం ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ గురించి వివరించారు.
ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ ద్వారా నేడు రైతులకు అనేక రకాల లాభాలు చేకూరుతున్నాయని రైతులు వైవిధ్యమైనటువంటి ఆయిల్ ఫామ్ పంటను ఎక్కువ సంఖ్యలో వేయాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెద్దపల్లి జిల్లాలో 2500 ఎకరాలు లక్ష్యంగా విధించడం జరిగిందని తెలిపారు.
ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ పార్టీల ద్వారా రైతులకి లాభాలు చేకూరుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ టీ ప్రశాంత్, డ్రిప్ కంపెనీ సిబ్బంది వ్యవసాయ విస్తరణ అధికారి ఎం యోజన తదితరులు పాల్గొన్నారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి