Minister Ponguleti Srinivas Reddy | పెద్దపల్లి, మే 19 : రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు (మే 20న) ఎలిగేడు మండలంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని.. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఎలిగేడు మండలంలోని ముప్పిరి తోట గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం 2025 రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
అనంతరం మంత్రి ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు బయలు దేరుతారన్నారు. మంత్రి పర్యటనకు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.