Volleyball Tournament | పెద్దపల్లి, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర స్థాయిలో యువతీ, యువకుల్లో క్రీడలు, సంస్కృతీ సాంప్రదాయాలను విస్తృతం చేసేందుకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం క్రీడలు, సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తుండగా.. 21న ఇప్పటికే నిర్వహించిన జానపద కళా పురస్కారాలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి తెలిపారు.
ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లోని ఆలయ ఫౌండేషన్ శంకర విజన్ సెంటర్ గురువారం ఉదయం రాష్ట్ర స్థాయి మెగా వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొదటి బహుమతిగా రూ. 50 వేలు..
రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని దాదాపుగా 26 జట్లు, మరో రెండు మహిళా జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 21వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 50వేల నగదు, ద్వితీయ బహుమతిగా రూ. 25 వేలు, తృతీయ బహుమతిగా రూ. 10వేలు, కన్సోలేషన్ బహుమతిగా రూ. 5వేల నగదును అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మే 31 నుంచి స్వీకరించిన ఆలయ ఫౌండేషన్ జాతీయ జానపద కళా పురస్కారాలు-2025అవార్డుల కోసం నామినేషన్లను స్వీకరించగా.. ఇందులో ఎంపిక చేసిన 15మంది ఫోక్ సింగర్స్, కవులు, కళాకారులకు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందజేయనున్నారు.
ఇందుకుగాను 150 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక చేసిన 15 మందికి ఈ పురస్కారాలను అందజేయనున్నారు. అదే విధంగా ప్రతీ ఏడాది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘సరస్వతీ పుత్ర’ బిరుదు ప్రధానోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యంత జానపద, కళా రంగాల్లో ప్రముఖులైన ఒకరికి అందజేయనున్నారు. తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలు, జానపదాన్ని బ్రతికించుకోవడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నారు.
తెలంగాణ కళల పరిరక్షణ కోసం స్థానిక కళాకారులను ప్రోత్సహించడం కోసం, మహానీయులను స్మరించుకోవడం కోసం, ప్రజల వినోదం, విజ్ఞానం, మధుర స్మృతులను పొందడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర సినీ, జానపద కవులు, కళాకారులు, నటులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్