Local Body Elections | సుల్తానాబాద్ రూరల్, జూలై 15 : ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పిటీసీ , సర్పంచులు తదితర స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చేస్తున్న ఏర్పాట్ల మేరకు పలువురు ఆశావహులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంగళవారం మండలంలోని గర్రెపల్లి గ్రామం మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షులు పడాల అజయ్ గౌడ్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని గౌడ కులస్తులను కలిశారు.
అలాగే వివిధ గ్రామాల ముఖ్య నాయకులను కలిసి మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా అజయ్ గౌడ్ మాట్లాడుతూ.. రేగడి మద్దికుంట, అల్లిపూర్ గ్రామాల్లో పర్యటించి గౌడ కులస్తులను కలిసి రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతుందని వారికి వివరించడం జరిగిందన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. వీరితోపాటు పలు గ్రామాల ముఖ్య నాయకులను కూడా ముందస్తుగా కలిసి వారి మద్దతును కోరడం జరిగిందన్నారు.
ఏది ఏమైనప్పటికీ ఎన్నికల హడావుడి మాత్రం మొదలైందని పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి