Harish Rao | 26 లక్షలు స్టాక్ ఉందన్నరు.. ఉంటే చూపించండి : బొగ్గు నిల్వలపై హరీశ్ రావు
Harish Rao | రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బొగ్గు నిల్వలు ఉండి ఉంటే ఇక్కడ 200 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు.
Harish Rao | మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ బృందం రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వెళ్లింది. పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు పోలీసుల వ్యవహార శైలి, ప్రభుత్వ తప్పుడు ప్రకటనలపై మండిపడ్డారు.
బొగ్గు నిల్వలు ఉండి ఉంటే ఇక్కడ 200 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులుండాలే. 50 వేలు కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయి వచ్చి నాకు ఫోన్ చేశారు. కంప్యూటర్లో మాత్రం 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో ఆర్జీ 1లో ఉన్నట్టు రాశారన్నారు. కానీ నిజంగానే 50 వేలు ఎందుకుందని కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన మేం అడుగుతున్నం. మీ నుంచి సమాధానం లేదు. చూడటానికి వెళ్తాం. నిజంగానే 6 లక్షలుందా..? నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. 26 లక్షలు స్టాక్ ఉందన్నరు. అందులో భాగంగా ఆర్జీ 1 లో 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ ఉండాలి కదా..? మరి 5 లక్షలుందా.. అక్కడ. చూపించండి ఉంటే అని ప్రశ్నించారు. లేదు కనుకనే పోలీసోళ్లను పెట్టి మమ్మల్ని ఆపుతున్నరని మండిపడ్డారు.
రామగుండంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రిలు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు pic.twitter.com/pVplBPO55z
— Telugu Scribe (@TeluguScribe) June 7, 2026
Read Also :
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

