Fever | కోల్ సిటీ, ఆగస్టు 6: రామగుండం నగర పాలక సంస్థ 25వ డివిజన్ పరిధి కేసీఆర్ కాలనీకి చెందిన చింతల పుష్ప కుమారుడు చింతల రాజు (17) అనే పదో తరగతి విద్యార్థి విష జ్వరానికి బలయ్యాడని ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు బుధవారం ఆరోపించారు. స్థానిక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హఠాత్తుగా శ్వాస ఆగిపోయి మృతి చెందినట్లు తెలిపారు.
కాగా, 25వ డివిజన్‌పై కక్షగట్టి శానిటరీ ఇన్స్పెక్టర్ చెత్త సేకరణ ట్రాలీలు పంపించడం లేదని, దాంతో ఇళ్లలో చెత్త పేరుకుపోయి దుర్గంధంతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి చూసి గత ఐదు రోజుల క్రితం ఆమె స్వయంగా తన సొంత స్కూటి వాహనానికి రెండు వైపులా డస్ట్ బిన్లు బిగించి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి శివారు ప్రాంతంకు తరలించిన సంఘటన తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్‌కు చెందిన చింతల రాజు అనే విద్యార్థి జ్వరంతో చనిపోయిన సంఘటనపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నగర పాలక అధికారులు కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారనీ, వారి డివిజన్లలో మాత్రమే పనులు చేస్తున్నారనీ.. మిగతా డివిజన్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డివిజన్లో పారిశుధ్యం లోపించి చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. తాను నిరసన తెలిపిన రోజునే అధికారులు స్పందించి డివిజన్లో పారిశుధ్యంపై చర్యలు తీసుకుంటే ఈ సంఘటన జరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
తమ డివిజన్లో ఇంకెంత మంది ప్రాణాలు పోతే తప్ప అధికారుల్లో చలనం వస్తుందని ప్రశ్నించారు. ఆ చిన్నారి ఉసురు ఊరికే పోదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్ అంటేనే మున్సిపల్ అధికారులకు ఎందుకు ఈ వివక్షత అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు