Post Box | కోల్ సిటీ, డిసెంబర్ 16 : గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో గల తపాలా డబ్బా (Post Box). రోజూ కనిపించే ఆ తపాలా డబ్బా ఉన్నట్టుండి కనిపించడం లేదు. ఇంతకీ ఎక్కడికెళ్లిందనుకుంటున్నారా..? పోస్ట్ బాక్స్ ఉంది కానీ అదెక్కడికి పోలేదు అక్కడే ఉంది. కాస్త జాగ్రత్తగా వెతికితే మీకే కనిపిస్తుంది.
టీబీజీకేఎస్ కార్యాలయం సమీపంలో రగ్గులు, స్వెట్జర్లు, చెద్దర్లు వగైరా ఉన్ని దుస్తులు విక్రయించే ఓ దుకాణంలో దాగిపోయింది. అక్కడ ఉండే పోస్ట్ డబ్బా చుట్టూ ఈ రగ్గులు విక్రయించే దుకాణం ఏర్పాటు చేయడంతో అది కాస్తా కనిపించకుండా పోయింది.
ఆ దుకాణం వద్దకు ఉన్ని దుస్తులు కొనుగోలు చేయడానికి వచ్చేవారికి అందులో తపాలా డబ్బా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాపం.. మొబైల్లో వాట్సాప్ వచ్చాక.. ఈ రోజుల్లో ఈ తపాలా డబ్బాను ఎవరు అంతగా వినియోగిస్తున్నారని కాబోలు సదరు వ్యాపారి ఆ తపాలా డబ్బాతో ఇంక పనేముందనుకొని దాని చుట్టూ తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో అక్కడ ఒకటి తపాలా డబ్బా ఉందనే విషయాన్నే అంతా మర్చిపోయారు.
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల