Congress party | ధర్మారం, జులై 23: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత రావడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఆ పార్టీ జంకుతుందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గస్థాయి బీజేపీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ కేవలం రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తుందని అన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలకు డబ్బులు సర్దుబాటు చేయడంలోనే నిమగ్నమయ్యారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిందని ఆయన దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేకత ఉండడం వల్లనే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అందుకు ఎన్నికలు జాప్యం కావడమే ఒక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలో గతంలో పనిచేసిన అధికారులే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారని ఈ క్రమంలో ఈ ప్రాంత ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ నిఘా పెట్టి వారి అవినీతిని నియంత్రించాలని పేర్కొన్నారు. పోలీసులు సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కొనసాగుతుందని విషయం ఆ పార్టీ ఎంపీ గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య అధ్యక్షుడు వహించగా, నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, పెద్దపల్లి ,జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, యాదగిరి బాబు, నియోజకవర్గంలోని పార్టీ మండల శాఖ అధ్యక్షులు, ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కుందేళ్ళ కిరణ్, ఉపాధ్యక్షులు దేవి కొమరేశం, కర్రి లక్ష్మణ్, పార్టీ సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారం మండల కేంద్రానికి చెందిన దేవి రాజలింగయ్య మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. రాజలింగయ్య కు పార్టీ కండువా హ్యాపీ ఆయన ఆహ్వానించారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్