పెద్దపల్లి, ఫిబ్రవరి24 : సర్వేయర్లు పని తీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లాలోని సర్వేయర్లకు 8 ల్యాప్‌టాప్‌లను అందజేశారు. భూముల సరిహద్దులు, రికార్డుల నిర్వహణ పటిష్టంగా నిర్వహించాలన్నారు. ల్యాప్ టాప్‌లను వినియోగించుకొని భూముల కొలతలను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, సర్వేయర్లు అనిల్, సునీల్, నరేష్, శ్రీనివాస్, కృష్ణప్రియ ,రాధిక, రాజశేఖర్, చారి, రఘుపతి , సాయి చరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Manchu Laxmi | నా కూతురు వాళ్ల నాన్న దగ్గరుంది.. భర్త గురించి మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్