Dragon | లవ్ టుడే ఫేం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన తాజా చిత్రం డ్రాగన్ (Dragon). ఓ మై కడవులే ఫేం అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ మూవీపై స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రశంసలు కురిపించాడు.
డ్రాగన్ ఒక అందమైన సినిమా. అశ్వత్ మారిమత్తు అద్భుతమైన రచనతో సినిమా తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రదీప్ రంగనాథన్ రాఘవన్ పాత్రలో మరోసారి తనలోని అద్బుతమైన నటుడిని చూపించాడు. ఇక జార్జ్ మరియస్, అనుపమ పరమేశ్వరన్, ముస్కిన్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చివరి ఇరవై నిమిషాలు నన్ను కన్నీళ్లు పెట్టించాయి. మోసగాళ్ల సంఖ్య పెరుగుతున్న ఈ ప్రపంచంలో చాలా అవసరమైన సందేశం ఇది.. అని ట్వీట్ చేశాడు శంకర్.
మీ సినిమాలు చూస్తూ పెరిగిన ఓ యువకుడు మీ నుంచి ప్రశంసలు పొందడం కలలో కూడా ఊహించనిది. ఓ అభిమానిగా.. నా అభిమాన దర్శకుడు (శంకర్) నుంచి స్పూర్తి పొందే వ్యక్తిగా.. మీరు నా గురించి మాట్లాడటం నమ్మశక్యంగా అనిపించడం లేదు. నా భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నా. ధన్యవాదాలు సార్. ప్రేమతో అంటూ తన ఎక్జయిట్‌మెంట్‌ను సందేశంలా రాసుకొచ్చాడు.
Sirrrrrrrr❤️ Never dreamt of getting these comments For a boy who grew up watching your films , being a fan who admired you , looked upto you … and u (my most fav director) talking about me is nothing but an unbelievable dream . I can’t express my feelings through words .… https://t.co/3MOPXpiLYL
— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025
MAD Square | ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
Kamal Haasan | త్రిషతోనే కాదు ఆమె కుమార్తెతోనూ సినిమా స్కూల్‌కు వెళ్తా : కమల్ హాసన్
Sundeep Kishan | పీపుల్స్ స్టార్ ట్యాగ్‌పై వివాదం.. స్పందించిన నటుడు సందీప్ కిషన్