Kamal Haasan : సినిమా అనే స్కూల్‌కు హీరోయిన్ త్రిష (Heroine Trisha) తోనే కాదని, ఆమె కుమార్తెతో కూడా కలిసి వెళ్తానని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. చెన్నైలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘థగ్‌లైఫ్’ మూవీలో కమల్‌తో కలిసి నటించిన అనుభవంపై త్రిష స్పందిస్తూ.. ‘థగ్‌లైఫ్’ చిత్రంలో నటించడం గొప్ప అనుభవంగా భావిస్తున్నా అన్నారు.
కమల్ హాసన్ వద్ద అనేక విషయాలు నేర్చుకున్నానని, ఆయనతో కలిసి ఒక పాఠశాలకు వెళ్ళిన అనుభూతిని పొందానని త్రిష చెప్పారు. ఆ స్కూల్లో అనేక విషయాలు తెలుసుకున్నాని తెలిపారు. ఈ సందర్భంగా కమల్ స్పందిస్తూ.. ‘నిజమే.. నేను త్రిషతో కలిసి స్కూల్‌కు వెళ్ళాను. అక్కడ అనేక విషయాలు నేర్చుకున్నాం. గురుస్థానం అనేది నాకొద్దు. అది దివంగత కే బాలచందర్‌తోనే ఉండిపోనివ్వండి’ అన్నారు.
తాను ఎల్లవేళలా ఒక విద్యార్థిగానే ఉండేందుకు ఇష్టపడతానని, త్రిషతో కలిసి స్కూలుకు వెళ్ళా నని కమల్ చెప్పారు. ఆ తరువాత ఆమె కుమార్తెతో కూడా పాఠశాలకు వెళతానని అన్నారు. సినిమా అనేది చాలా పెద్దదని, తాను 5వ తరగతి వరకు మాత్రమే నేర్పించగలనని వ్యాఖ్యానించారు. పీహెచ్డీ స్థాయికి నేను నేర్పించలేనని, ఆ స్థాయిలో నేను నేర్చుకోలేదని అన్నారు. సినిమా అనేది అనేక విషయాల సమ్మేళనమని పేర్కొన్నారు.