Sundeep Kishan Peoples Star Tag | నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా. ఈ సినిమాను దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. లవ్ & కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రంలో రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ మూవీతో పీపుల్స్ స్టార్ అనేట్యాగ్ ను తగిలించుకున్నాడు సందీప్ కిషన్. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్దఎత్తున్న చర్చకు దారితీసింది.
దిగ్గజ దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ట్యాగ్‌ను మీరు ఎలా వాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై సందీప్ కిషన్‌ని ప్రశ్నించగా.. సందీప్ మాట్లాడుతూ.. ఆర్. నారాయణ మూర్తికి ఆ ట్యాగ్ ఉందని నాకు తెలిందండి.. నేను ట్యాగ్ల మీదా ఫోకస్ పెట్టేవాడిని కాను. ఈ ట్యాగ్ నాకు పెట్టిన తర్వాత మూర్తి గారికి ఆ ట్యాగ్ ఉన్న విషయం నాకు తెలిసింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో మేము ఆలోచించాం అంటూ సందీప్ కిషన్ చెప్పుకోచ్చాడు.