MAD Square | ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
MAD Square | మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా టీజర్ అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు.
MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం సీక్వెల్స్‌తో హిట్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టిన నాగవంశీ.. మరో క్రేజీ సినిమాకు సీక్వెల్ తీసుకోస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్. సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.
మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత నటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లడ్డుగాని పెళ్లితో పాటు సెకండ్ సింగిల్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ టీజర్‌ను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
They live for the thrill and now they’re at it again! 😎#ThisTimeItsMadMaxx 🔥
A high energy display of madness is PULLING UP with #MADSquareTeaser this Feb 25th! 🤟🏻
Ika ready aipondi mama 🥳 #MADSquare In cinemas from March 29th! 😎@NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/fdaTpHC0rK
— Sithara Entertainments (@SitharaEnts) February 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

