Manchu Laxmi | నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న టాలీవుడ్ సెలబ్రటీల్లో ఒకరు మంచు లక్ష్మి (Manchu Laxmi) . కెరీర్ తొలినాళ్లలో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసిన ఈ భామ కొంతకాలంగా సినిమాల విషయంలో నెమ్మదించిన విషయం తెలిసిందే. కాగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. అందులోనా వైవాహిక జీవిత విషయాలపై పలు సందర్భాల్లో నెట్టింట చర్చ నడిచిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
మంచు లక్ష్మి భర్తతో కలిసి తక్కువగా కనిపించడంతో.. ఈ భామ భర్తకు దూరంగా ఉంటుందని నెట్టింట పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ పుకార్లపై ఎప్పుడూ అంతగా స్పందించని మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నా భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన విదేశాల్లో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. మా వైవాహిక జీవితంలో మేము చాలా అన్యోన్యంగా ఉంటామని చెప్పింది.
మేము సమాజంలో బతికేలా స్వేచ్చను ఇచ్చిపుచ్చుకుంటాం. జనాలు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తూ మా ప్రశాంతతను కోల్పోం. నేను ప్రస్తుతం నా భర్తతో కలిసి ఉంటున్నా. నా కూతురు ఇప్పుడు వాళ్ల నాన్న దగ్గర ఉందంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆదిపర్వం ప్రాజెక్టుల్లో నటిస్తుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!