Toxic The Movie | కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ (Toxic). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు.
యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త అభిమానులు, మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ మూవీని ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేయనున్నారు. టాక్సిక్ను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీగా నిలువనుంది టాక్సిక్. యశ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా సాగనుందని ఇన్సైడ్ టాక్.
కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ వింటేజ్ టాక్సీ, రౌండప్ క్యాప్ పెట్టుకున్న యశ్ ప్రీ లుక్ విడుదల చేయగా సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
IT’S OFFICIAL… YASH’S NEXT FILM ‘TOXIC’ BEING SHOT IN KANNADA & ENGLISH… #Toxic: A Fairy Tale For Grown Ups – starring #Yash – is the first big-scale #Indian movie to be conceptualized, written and filmed simultaneously in both #English and #Kannada, paving the way for a truly… pic.twitter.com/5sJLoOg58o
— taran adarsh (@taran_adarsh) February 24, 2025
MAD Square | ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
Kamal Haasan | త్రిషతోనే కాదు ఆమె కుమార్తెతోనూ సినిమా స్కూల్‌కు వెళ్తా : కమల్ హాసన్
Sundeep Kishan | పీపుల్స్ స్టార్ ట్యాగ్‌పై వివాదం.. స్పందించిన నటుడు సందీప్ కిషన్