Hit 3 Teaser | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి హిట్ ప్రాంఛైజీ హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నాడు నాని. నాని పాత్రపై స్నీక్ పీక్ అందిస్తూ గ్లింప్స్ విడుదల చేయగా.. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా మేకర్స్ టీజర్‌ను లాంచ్ చేశారు. సార్ మీకు ప్రాబ్లమ్ లేదంటే ఒక పేరు చెబుతా.. అర్జున్ సర్కార్.. అంటూ సాగే డైలాగ్స్‌లో షురూ అయింది టీజర్. ఈ కేసు ఆడికివ్వడంలో ప్రాబ్లమ్స్ ఏం లేదుగానీ.. వీడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తే భయమేస్తుందని ఉన్నతాధికారి హోదాలో ఉన్న రావు రమేశ్ అంటుండగా.. మరోవైపు డ్యూటీలో చేరిన అర్జున్ సర్కార్ అందరూ ఒకే మెథడ్‌లో మర్డర్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉందంటున్నాడు.
మొత్తానికి మిస్టరీ కేసులను అర్జున్ సర్కార్‌గా లాఠీకి పని చెబుతూ ఎలా చేధించాడనే నేపథ్యంలో ఆసక్తికరంగా సినిమా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
హిట్ 3 టీజర్..
MAD Square | ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
Kamal Haasan | త్రిషతోనే కాదు ఆమె కుమార్తెతోనూ సినిమా స్కూల్‌కు వెళ్తా : కమల్ హాసన్
Sundeep Kishan | పీపుల్స్ స్టార్ ట్యాగ్‌పై వివాదం.. స్పందించిన నటుడు సందీప్ కిషన్