అడ్డగోలుగా అప్పులు
తెలంగాణను సీఎం రేవంత్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, గత 10 నెలల్లో ఆయన సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులు వార్షిక రుణ సమీకరణ లక్ష్యాన్ని దాటి 128 శాతానికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు మార్ ధ్వజమెత్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణా లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ సర్కార్..
- బడ్జెట్ అంచనాలను దాటి 128 శాతానికి చేరిక
- రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు 18శాతమే
- రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు
- ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చారు
- కాగ్ తాజా నివేదికే నిదర్శనం
- రేవంత్సర్కార్పై దాసోజు ధ్వజం
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను సీఎం రేవంత్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, గత 10 నెలల్లో ఆయన సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులు వార్షిక రుణ సమీకరణ లక్ష్యాన్ని దాటి 128 శాతానికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు మార్ ధ్వజమెత్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణా లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ సర్కార్.. గత నెల చివరి నాటికే రూ.69,148 కోట్ల అప్పులు తెచ్చిందని, కాగ్ తాజా నివేదికతో కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయటపడిందని తెలిపా రు. ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.22,782 కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు కేవలం రూ.4,213 కోట్లు (18%) మాత్రమే తెచ్చుకోగలిగిందని ఆదివారం ప్రకటనలో విమర్శించారు.
కాంగ్రెస్ బడ్జెట్ అబద్ధాల పుట్ట
నిరుడు కాంగ్రెస్ సర్కార్ ప్రైవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధాల పుట్ట అని దాసోజు నిప్పులు చెరిగారు. ఆ బడ్జెట్లో రూ.2,29,720 కోట్ల ఆదాయం వస్తుందని గొప్పలు చెప్పిన ప్రభుత్వానికి ఇప్పటివరకు కేవలం రూ.1,38,371 కోట్లు (60%) మాత్రమే వచ్చిందని ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల ముందే బడ్జెట్లో 40% లోటు ఉండటం సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని తూర్పారబట్టారు. ఫ్యూచర్‌సిటీ అంటూ ఊదరగొడుతున్న సీఎం రేవంత్ మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతనే లేదని ధ్వజమెత్తారు. కనీసం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సరిగా అంచనా వేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు.
ఢిల్లీకి వెళ్లేది ఫొటోషూట్ల కోసమేనా?
సీఎం పదే పదే ఢిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసమా? లేక ఫొటో షూ ట్ల కోసమా? అని ప్రశ్నించారు. బడే భాయ్ అంటూ మోదీ చుట్టూ తిరుగుతున్న రేవంత్ కేంద్రం నుంచి నయాపైసా కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
బడ్జెట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు ఎందుకు తప్పాయో చెప్పాలని, ఆదాయం ఎందుకు త గ్గిందో శ్వేతపత్రం విడుదల చేయాల ని, పరిమితికి మించి చేసిన అప్పులపై బహిరంగ వివరణ ఇవ్వాలని దాసోజు సర్కార్‌ను డిమాండ్ చేశా రు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌సిటీ, రైతుబంధు, 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టం చేయాలని, జీఎస్టీ, ఎక్సైజ్ రాబడులను పెం చేందుకు ప్రణాళిక ఏమిటో చెప్పాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

