Ramagundam NTPC Elections | గోదావరిఖని, సెప్టెంబర్ 23 : రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్టీపీసీ పర్మినెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మంగళవారంతో ప్రచారం ముగుస్తుండడం, 25వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతుండడం ఆసక్తిని రేకెతిస్తోంది. రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగిగా పనిచేసి గతంలో బీఎంఎస్కు నాయకత్వం వహించిన వడ్డేపల్లి రామచందర్ ప్రస్తుతం కీలకమైన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా క్యాబినెట్ హోదాలో కొనసాగుతుండడంతో అతని అనుచరులు బీఎంఎస్ ను ఎన్టీపీసీలో గెలిపించి అతనికి గిఫ్ట్ గా ఇవ్వాలని తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఇప్పటికే రెండు పర్యాయాలు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీ ఎన్ బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు 2027లో వేతన సవరణ ఉండడం అందులో మెరుగైన వేతనాలను ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ, బీఎంఎస్లు కార్మికులకు వాగ్దానం చేస్తున్నాయి. కార్మికులకు ఇప్పటికే పీఆర్పీని తామే ఇప్పించామని రెండు సంఘాలు చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నాయి.
మొత్తం 220 ఓట్లు ఉన్నా రామగుండం ఎన్టీపీసీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని యజమాన్యం నిర్ణయించింది. దీంతో అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో సీఐటీయూ పోటీలో ఉన్నప్పటికీ వారికి పెద్దగా క్యాడర్ లేకపోవడం నామమాత్రంగానే సీఐటీయూ పోటీపడే అవకాశాలు కనిపిస్తుంది.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి