Koya Sree Harsha | పెద్దపల్లి, జూన్ 1 : జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ర్టం ఆవిర్భవించి 11 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్యఅతిథిగా హాజరు అవుతారని తెలిపారు. ఉదయం 9.45 గంటలకు ముఖ్య అతిథి కలెక్టరేట్‌కు చేరుకుంటారని, 9.50 గంటలకు గౌరవ వందనం, 9.51 నుంచి 9.58 వరకు అమరవీరులకు నివాళి, 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన, తెలంగాణ గీతాలాపన, 10.11 నుంచి 10.15 వరకు పరేడ్, అనంతరం ముఖ్య అతిథి సందేశం ఉంటుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!