IAS Narahari | పెద్దపల్లి, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజాపద కళాకారులకి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందుకోసం ఆసక్తిదారులు దరఖాస్తులు చేసుకోవాలని ఆలయ ఫౌండేషన్ సలహాదారు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే ధ్యేయంతో ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినూత్నంగా రూపొందించిన ప్రజాపద కళల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజాపద, జానపద, సాంప్రదాయ కళారంగాల్లో ఉన్న అసంఖ్యాక ప్రజల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి పాలకుర్తి మండలం బసంతనగర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన గ్రామాల్లో ఎంతో గొప్ప కళల సంపద ఉందని అయితే చాలామంది కళాకారులు సరైన వేదిక లేక చిన్నచూపు కారణంగా గుర్తింపు పొందలేకపోతున్నారన్నారు. అలాంటి కళాకారులకు అవార్డులు ఇవ్వడం ద్వారా వారికి గౌరవం, గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇది వారు ఆర్థికంగా, మానసికంగా ఎదగడానికి మార్గం చూపుతుందని ప్రతి జిల్లా నుంచి ప్రతిభ గల కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జూన్ 1 నుండి 10 వరకు అర్హతలు కలిగిన కళాకారులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు తమ అవసరమైన పూర్తి పేరు, తండ్రి / భర్త పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్, ఇల్లు నెం., గ్రామం / పట్టణం, మండలం, జిల్లా, విద్యార్హత, కళారంగం: Indian / Folk / Traditional / Others * సోషల్ మీడియా లింకులు (ఉంటే) 9949446802 / 9885981959 ఈ నెంబర్లను సంప్రదించాలన్నారు. అదేవిధంగా aalayafoundation2015@gmail.com ద్వారా అభ్యర్థులు తమ కళా ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, సోషల్ మీడియా లింకులు జతచేయాలన్నారు. ఎంపిక ప్రక్రియ అనంతరం అవార్డుల కార్యక్రమం బసంతనగర్ కంటి హాస్పిటల్ ఆవరణలో జూన్ 21వ తేదీన నిర్వహించబడుతుందని వివరించారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!