Rice Mill | సుల్తానాబాద్ రూరల్ : పెద్దపల్లి జిల్లా (Peddapalli district) సుల్తానాబాద్ (Sultanabad) మండలంలో ప్రమాదం జరిగింది. కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లులో బాయిలర్ పేలింది (Boiler Blast). ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన యాజమాన్యం గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రైస్‌మిల్ యాజమాన్యం తెలిపింది. ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చినట్లు పేర్కొంది. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. రెండు గోదాములతోపాటూ మిషన్లు, వరి ధాన్యం, బియ్యం తదితర వస్తువులు దెబ్బతిన్నట్లు వివరించింది. దాదాపు రూ.2కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read..
Golconda Express | పట్టాలపైకి వరద నీరు.. డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
Musi | ఉప్పొంగిన మూసీ.. పోచంపల్లి – బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్
Crow | కుటుంబంలో ఒక్కటైన ‘కాకి’.. నల్గొండ జిల్లాలో వింత ఘటన