Crow | హైదరాబాద్ : కాకి.. అంటేనే అందరూ ఈసడించుకుంటారు. దాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోకి అసలు రానివ్వరు. కానీ ఈ దంపతులు మాత్రం కాకిని చేరదీశారు. తమ సొంత బిడ్డలాగా కాకి ఆలనాపాలనా చూసుకుంటున్నారు.
దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్, సాఫియా కుటుంబంతో ఓ కాకి ఏడాది కాలంగా కలిసి ఉంటున్నది. ఉదయం ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందని.. కాకిని కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నామని సాఫియా పేర్కొంది. కాకికి అన్నం, చికెన్ ఆహారంగా ఇస్తున్నామని తెలిపింది. అయితే, 2 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పశువుల ఆసుపత్రికి తీసుకురాగా, పరీక్షించి చికిత్స అందించారు వైద్యులు.
కాకిని ప్రేమగా చూసుకుంటున్న షేక్ యూసుఫ్, సాఫియా దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అందరూ ఈసడించుకునే కాకిని చేరదీసి, దాని ఆలనాపాలనా చూసుకోవడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. అంతేకాకుండా దానికి ఆహారాన్ని అందించడం.. పక్షుల పట్ల వారికున్న ప్రేమను చూపిస్తుందని పేర్కొంటున్నారు.
కుటుంబంలో ఒక్కటైన కాకి.. నల్గొండ జిల్లాలో వింత ఘటన
దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ – సాఫియా కుటుంబంతో ఓ ఏడాదిగా కలిసి ఉంటున్న కాకి
ఉదయం ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందని.. కాకిని కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నామని, అన్నం, చికెన్ ఆహారంగా ఇస్తామని… pic.twitter.com/L9MfxyuwD5
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2025