Golconda Express | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది. డోర్నకల్ రైల్వే స్టేషన్లో గుంటూరు నుంచి సికింద్రాబాద్కు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వర్షాల కారణంగా ఈ రెండు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.