Musi | భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 29 : మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోచంపల్లి- బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు బీబీనగర్, భువనగిరికి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళుతున్నారు. మూసీ ఉధృతితో అధికారులు ఇరు వైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. అధికారులు పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తoగా ఉండాలని, మూసీ పరివాహక ప్రాంతాల్లో సంచరించవద్దని మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి సూచించారు.