మానకొండూరు రూరల్, ఫిబ్రవరి 13: మానకొండూరు మండలం ఊటూరులోని ఇసుక రీచ్‌లో( Sand reach) గురువారం రవాణా, రెవిన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. రీచ్ రికార్డులను పరిశీలిం చారు. ఇసుక యార్డుకు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనాలను నిరంతరం తనిఖీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం స్థానిక అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐ రవి కుమార్, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వర్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అపురూపంగా గాజులు తొడిగిన పూసలక్క