MLC Kavitha | జనగామ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ జనగామ జిల్లాలోని పెంబర్తిలో పర్యటించారు. స్థానికంగా ఉన్న మహమ్మాయి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జాతరలో కలియతిరిగారు. మహిళలతో కవిత ముచ్చటించారు.
ఇక పూసలక్కలు కనిపించగానే ఎమ్మెల్సీ కవిత సంబురపడిపోయారు. వారితో గాజులు వేయించుకుని మురిసిపోయారు. గాజుల గంపను కవిత నెత్తిన పెట్టుకోగానే.. పూసలక్క సంతోషం వ్యక్తం చేశారు. మన జనగామ పెంబర్తిలో మా పూసలోళ్ల అక్కాచెల్లెండ్లు నాకు అపురూపంగా గాజులు తొడిగిండ్లు అని కవిత పేర్కొన్నారు. జయహో పూసలక్క.. జయహో బీసీ.. అని కవిత నినదించారు.
పెంబర్తిలో హస్తకళాకారుల సొసైటీ సభ్యులను కలిసి వారి సమస్యలను, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలిఘటించారు. పెంబర్తి గ్రామంలో బస్టాప్ని తొలగించినట్లు స్థానికులు తన దృష్టికి తీసుకురాగా… వెంటనే ఆ గ్రామంలో బస్టాప్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అలాగే, పెంబర్తి హస్తకళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వారు తయారు చేసే ఉత్పుత్తులకు తగిన ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.
జాతి సిగలో మెరువులు సంచార బిడ్డలు
జీవన మాధుర్యపు బంధువులు
ప్రేమైక జీవన సారథులు..
సాంప్రదాయ సౌందర్యపు ప్రతీకలు..పూసలగంప పూల పుప్పొడి స్వచ్ఛతకు లోగిలి..
తెలంగాణ చేతివృత్తుల చేతనం..
ముత్తయిదు గాజుల మురిపెం..మన జనగామ పెంబర్తిలో మా పూసలోళ్ల అక్కాచెల్లెండ్లు నాకు అపురూపంగా గాజులు… pic.twitter.com/AhfZ82CSBe
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 13, 2025
ఇవి కూడా చదవండి..
KCR | కేసీఆర్కు కలిసిన శుభప్రద్ పటేల్.. బీసీ కులగణలో తప్పులపై చర్చించిన బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
BRS Party Meeting | కేసీఆర్ అధ్యక్షతన 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం