Indiramma Beneficiaries | చిగురుమామిడి, జూన్ 4 : మండల కేంద్రంలోని రైతు వేదికలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమావేశంలో ప్రత్యక్షంగా అధికారులకు కాంగ్రెస్ నాయకులకు సమస్య కనిపించినప్పటికీ పరిష్కరించే దిశగా వారు దృష్టి సారించలేదు. చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు.
మండలంలోని 305 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా.. రైతు వేదిక కెపాసిటీ 125 మంది కూర్చునే అవకాశం ఉంది. కానీ అధికారులు మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా రైతు వేదికలో ప్రొసీడింగ్స్ పంపిణీ ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో రైతు వేదికలో కూర్చునేందుకు మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. చాలామంది గంటల తరబడి నిలుచుని ఉన్నారు. మరికొందరు రైతువేదిక ఆరు బయట నిల్చున్నారు. చాలామంది మహిళలు వసతులపై అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపిణీ కార్యక్రమం సైతం సజావుగా సాగకపోవడంతో కాంగ్రెస్ నాయకులు, ఎంపీడీవో సైతం చేతులెత్తేశారు. గ్రామాల వారీగా రైతు వేదిక బయటకు లబ్ధిదారులను పిలిచి గ్రామాల వారీగా గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇతర నాయకులు పంపిణీ చేయించారు. ఎంతో పారదర్శకంగా జరగాల్సిన లబ్ధిదారుల పంపిణీ తీవ్ర అసౌకర్యాల మధ్య జరగడం పట్ల మహిళలు అధికారుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేయడం జరిగిందని, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. రైతు వేదికలో బుధవారం ఎంపీడీవో భాశం మధుసూదన్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్స్ అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న, జిల్లా నాయకులు ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు