JEE Mains 2025 Results | తిమ్మాపూర్, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు (IITs), ఎన్ఐటీల (NITs) లో ప్రవేశాల కోసం ఏన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కరీంగనర్ ఎస్ఆర్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఫలితాల్లో తమ ప్రతిభ చాపించారు.
కరీంనగర్ జోనల్ పరిధిలో 148 మందికిపైగా విద్యార్థులు అర్హత సాధించారు. మెయిన్స్ ఫలితాల్లో 11 మంది విద్యార్థులు 90.10 శాతంపైగా మార్కులు సాధించారు. ఇందులో కొల్లూరి హాసిని 99.3 శాతం, బుర్ర మాధవ్ 99.14శాతం, శివసాయి 98.53 శాతం సాధించారు.
విద్యార్థులను అల్గునూర్‌లోని ఎస్సార్ జూనియర్ కళాశాల క్యాంపస్‌లో కళాశాలల జోనల్ ఇంచార్జ్ నేదురి తిరుపతి అభినందించారు. ఇవన్నీ తమ సొంత విద్యార్థుల ఫలితాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్స్ అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళు నాగార్జున రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మారుతి, సరోత్తమ్ రెడ్డి, సిహెచ్ ప్రవీణ్ రెడ్డి, ఏవో లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
సత్తాచాటిన చొప్పదండి విద్యార్థులు..
చొప్పదండి, ఫిబ్రవరి12 : జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మడిపల్లి సాయికిరణ్, తమ్మడి విష్ణువర్ధన్ జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో NTA స్కోర్ 79. 8117055, 62.6960 స్కోర్‌ను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ శరత్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు