DEO Yadaiah | ఆత్మ విశ్వాసంతో విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలి : డీఈవో
DEO Yadaiah | ఆత్మ విశ్వాసంతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని మంచిర్యాల డీఈవో ఎస్. యాదయ్య సూచించారు.
కాసిపేట : ఆత్మ విశ్వాసంతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవాలని మంచిర్యాల డీఈవో ఎస్. యాదయ్య ( DEO Yadaiah ) సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని పదో తరగతి విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మోటివేషనల్ స్పీకర్ ప్రకాష్ బనావత్ ద్వారా అవగాహన సదస్సును నిర్వహించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంటం తిరుపతి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు చెట్టి శ్రీధర్ సభా అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీఈవో ఎస్.యాదయ్య ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సమయపాలన పాటించాలని, కాలం విలువైనదిగా గుర్తించి నేటి పని రేపటికి వాయిదా వేయకుండా క్రమ శిక్షణతో వ్యవహరించాలన్నారు. లక్ష్యమే గమ్యంగా ముందుకు వెళ్లి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు పది పరీక్షల్లో తీసుకోవాల్సిన అంశాలపై క్షుణ్ణంగా వివరించారు
అనంతరం విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, జిల్లా కోఆర్డినేటర్ మూర్తి, ఓరియంట్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ అట్టెపల్లి శ్రీనివాస్, డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్, జిల్లా గర్ల్ చైల్డ్ స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మీ, ప్రిన్సిపాల్ ఖలీల్, హెచ్ఎం సాంబమూర్తి, బండ శాంకరి, నాగమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

