దామరచర్ల, ఫిబ్రవరి 06 : దామరచర్ల మండలం రాళ్లవాగుతండా సమీపంలో పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స కోసం వీరిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించారు. ప్రేమికులను యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామానికి చెందిన సౌమ్య, రాకేష్ గా గుర్తించారు. తమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన వాడపల్లి పోలీసులు తెలిపారు.