కోస్గి : నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Laxmareddy) , మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ( BRS Candidates ) మద్దతుగా ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు మోసపోయారని,ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు. హామీలు నెరవేరుస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో పోయిందని విమర్శించారు.ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ను దూషిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని , పేర్కొన్నారు.