పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక అనే మహిళ తన ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించి తను తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఆమె కొడుకు కృష్ణంత్(10) ,కూతురు మయాంత లక్ష్మి(8) హైదరాబాద్లోనే ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి ఎస్ఐ రవికిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చూడా చదవండి..
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
Marco OTT | మరో ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్ ‘మార్కో’
GHMC | కుల గణనలో నమోదు కాని వారి కోసం.. జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్