Traffic Signals | కోరుట్ల, జూన్ 8 : లక్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూఎస్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్, జగిత్యాల, వేములవాడ పట్టణాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారిగా ఉన్న కోరుట్లలోని జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేందుకు ఏకైక మార్గంగా ఉంది.
ట్రాఫిక్ నియంత్రణ లేక..
బైపాస్ రోడ్డు లేని కారణంగా వందలాది చిన్న, భారీ వాహనాలు కూడ ఈ రహదారి గుండానే ప్రయాణించాల్సి వస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిగ్నల్స్ పని చేయక మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలు, ఇష్టానుసారంగా వాహన రాకపోకలతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపైపాటూ ఈ రెండు చౌరస్తాల నుంచి రోడ్డుపైకి చేరే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు.
కొన్ని సందర్భాల్లో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కొత్త బస్తాండ్, నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించాలని, సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన స్పందించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి