Govt Schools | కోరుట్ల, మే 20 : పాఠశాల స్థాయి నుంచి విద్యను బలోపేతం చేయాలని మండల విద్యాధికారి గంగుల నరేష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులను ఎంఈఓ గంగుల నరేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతోపాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ద్వారా బోధన మెరుగుపరచాలని అన్నారు. విద్యార్థులకు బోధన సామర్ధ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ, విషయ పరిజ్ఞానంపై ఆసక్తికరమైన విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవలసిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు అందే శివప్రసాద్, సిరిపురం శ్రీనివాస్, అంకం దామోదర్, గంగుల రణధీర్, అన్నం మహేష్, మాసం చిరంజీవి, కోసరి శేఖర్, సీఆర్పీలు గంగాధర్, దేవేందర్, సత్యనారాయణ, మన్విత, జ్యోతి, కంప్యూటర్ ఆపరేటర్ రాజేశ్వర్, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ