Senior citizens | జగిత్యాల, జూన్ 01 : అందుబాటులోకి తెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడంపై తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకు ప్రత్యేక వైద్యసేవల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో 1లక్షా 8 వేల 396 మంది వయో వృద్ధులున్నారని తమ అసోసియేషన్ సర్వేలో తేలిందన్నారు. అయితే వయోవృద్ధులు కుటుంబ సమస్యలతోపాటు వివిధ కారణాలతో ఒత్తిళ్లకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించడానికి తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా రావు వినతి పత్రంపై ప్రభుత్వం స్పందించి ఒకే చోట వివిధ వ్యాధులకు చికిత్స అందేలా రాష్ట్రంలోని 34 ప్రభుత్వ భోదనాస్పత్రుల్లో వయోధికులకు చికిత్స వార్డులు ఏర్పాటు చేశారన్నారు.
ఈ వార్డుల్లో జనరల్ మెడిసిన్, సర్జరీ, నేత్ర, చెవి, ముక్కు, దంత, గొంతు, మానసిక, నరాలకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకి ఇన్ పేషంట్లుగా చికిత్స అందిస్తారని చెప్పారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వయోవృద్ధులకు ప్రత్యేక చికిత్స వార్డు ఏర్పాటు చేశారని వివరించారు. ఈ సమావేశంలో జిల్లాప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు పి.హన్మంత రెడ్డి, ఎండి యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి అశోకరావు, నారాయణ, నాయిని సంజీవ రావు, కండ్లే గంగాదర్, పబ్బా శివానందం, బి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!