Clinics | నిబంధనల ప్రకారమే క్లినిక్‌లను నిర్వహించాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రమోద్ కుమార్ ఇవాళ వైద్యాధికారులతో కలిసి మెట్పల్లి పట్టణంలోని పలు క్లినిక్‌లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి క్లినిక్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి క్లినిక్‌ను మూసివేయించారు.
క్లినిక్ నిర్వాహకులను స్థానిక పోలీసులకు అప్పగించారు. ప్రజలు అర్హులైన వైద్యుల ద్వారా చికిత్స చేయించుకోవాలని అనుమతులు లేకుండా వైద్య పరీక్షలు చేసినా, చికిత్సను అందించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్, మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి