Drinking Water | కోరుట్ల, ఏప్రిల్ 8 : వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇవాళ మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో మంచినీటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని 33 వార్డుల్లో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఇంటింటికి వేసవిలో తాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ పైప్లైన్లో ఇబ్బందులు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇంటింటికి సక్రమంగా నీరందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న వార్డుల్లో ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీరు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్, మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ డీఈఈ, ఏఈలు, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్