MLA Sanjaykumar | జగిత్యాల రూరల్ జూన్ 4 : అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరాన్ని కొనసాగించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహాయ సహకారాలతో కొనసాగించాలన్నారు. ధ్యాన మందిరం పనులు చివరి దశకు చేరుకున్నసందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలోమంచి రోజులను పురస్కరించుకొని పుణ్య వచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.
తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారని వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ధ్యాన మందిరం ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని.. నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు అంతేకాకుండా ధ్యాన మందిరం ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిధిలావస్థకు చేరుతుందని వెంటనే దాని తొలగించి రాబోయే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా నిర్మాణం తొలగింపుకై కలెక్టర్కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బంది ఎండోమెంట్ అధికారులకు తెలియజేసి శిధిలా వస్థ శిధిలాలను తొలగించాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వైదిక క్రతువులో పాల్గొని బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని పొందారు. మున్ముందు ధ్యాన మందిరానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాల కోసం తన వంతు కృషి చేస్తానని.. బ్రాహ్మణ బంధువులు అందరు దాతల సహకారంతో ధ్యాన మందిర అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల శ్రీనివాస్, మోతే ఉమాకాంత్ శర్మ, మందిరం భారవి శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, చంద్రశేఖర్, శ్రీధర్ గణపతి, పార్థసారథి శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్, కార్తీక్, కిరణ్, ఈవో సురేందర్, వార్డ్ నాయకులు అనుమల రఘు, భాస్కర్ శర్మ, రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు