Jeevan Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లకు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా రైతులకు మద్దతుగా వెళ్తున్నమాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు జగిత్యాలలో అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని రైతులు నిరసనకు దిగారు. వారికి మద్దతుగా నూకపల్లి గ్రామ శివారులో రోడ్డుపై బైఠాయించిన జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతులకు మద్దతుగా వెళ్తున్న జీవన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ వద్ద వరద కాలువకు నీటిని ఎత్తిపోయాలని నిరసనకు దిగిన రైతులకు మద్దతుగా వెళ్తుండగా నూకపల్లి గ్రామ శివారులో జీవన్ రెడ్డి అరెస్ట్ pic.twitter.com/hugdCqsztl
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2026